చేనేత సమస్యల పరిష్కారానికి వినతి
logo
Published : 18/06/2021 02:56 IST

చేనేత సమస్యల పరిష్కారానికి వినతి

ఆప్కో ఛైర్మన్‌ మోహనరావుకు సమస్యలు వివరిస్తున్న నాయకులు

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకులు గురువారం విజయవాడ ఆప్కో కార్యాలయంలో ఛైర్మన్‌ చిల్లపల్లి మోహనరావును కలసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని సహకార సంఘాల్లో పెద్ద మొత్తంలో వస్త్ర నిల్వలు పేరుకుపోయాయని, వీటిని కొనుగోలు చేయాలని కోరారు. జులై మొదటి వారంలో కొనుగోలు చేస్తామని ఆప్కో ఛైర్మన్‌ హామీనిచ్చారు. సహకార సంఘాలకు ఆప్కో ద్వారా నూలు సరఫరా చేయాలని, వచ్చే నెల మొదటి వారంలో ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలకు సగం నగదును వెంటనే చెల్లించి సంఘాలను ఆదుకోవాలని సంఘం ప్రతినిధులు కోరారు. టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆస్తుల్ని ఆప్కో తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మాణం తలపెట్టిన చేనేత పార్కులను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు కట్టా హేమసుందరరావు, ఉపాధ్యక్షుడు పిల్లల మర్రి నాగేశ్వరరావు, సర్వోదయ సహకార సంఘం అధ్యక్షుడు రావూరి భాస్కరరావు, కుర్మా విఘ్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని