24.59 టన్నుల పీడీఎస్‌ బియ్యం పట్టివేత
logo
Published : 18/06/2021 02:56 IST

24.59 టన్నుల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కరప, న్యూస్‌టుడే: రేషన్‌ బియ్యాన్ని ప్రజల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తుండగా కరప పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లా కరప మండల పరిధిలోని పెనుగుదురు కేఎంజే కెనాల్‌ వంతెన వద్ద బుధవారం రాత్రి ఇన్‌ఛార్జి ఎస్సై ఎం.పవన్‌కుమార్‌ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. విజయవాడ నుంచి బియ్యం లోడ్‌తో కాకినాడ వైపు వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా.. డ్రైవర్‌ పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చింది. లారీలో 517 బస్తాల (24.59 టన్నులు) బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం లోడు పంపించిన వ్యక్తికి ఫోన్‌ చేయగా.. స్విచ్చాప్‌ చేసి ఉంది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బియ్యం లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్సై పవన్‌కుమార్‌ పీడీఎస్‌ బియ్యంగా అనుమానిస్తూ ఇన్‌ఛార్జి తహసీల్దారు మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఎంఎస్‌వో పి.సుబ్బారావు గురువారం ఉదయం బియ్యం నమూనాలను జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి పంపించి కలెక్టర్‌కు సమాచారం అందించారు. లారీ డ్రైవర్‌తో పాటు యజమానిపై కేసు నమోదు చేశామని, పీడీఎస్‌ బియ్యంగా నిర్దారణ జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై, ఎంఎస్‌వోలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని