వారం వ్యవధిలో తండ్రీ కొడుకుల మృతి
logo
Published : 18/06/2021 02:56 IST

వారం వ్యవధిలో తండ్రీ కొడుకుల మృతి

బ్లాక్‌ ఫంగస్‌తో పోరాడుతున్న తల్లి

మైలవరం, న్యూస్‌టుడే: కరోనా ఓ మధ్య తరగతి కుటుంబాన్ని విషాదంలో ముంచింది. మైలవరం తారకరామానగర్‌కు చెందిన బెజవాడ ఏడుకొండలు(70) కరోనాతో వారం క్రితం ఇంటి వద్దనే మరణించారు. కొవిడ్‌ సోకిన ఆయన కుమారుడు సాంబయ్య(45) పది రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గురువారం సాయంత్రం ఆయన మరణించాడు. తండ్రి మరణించిన సంగతి కుమారుడికి తెలియదు. ఏడుకొండలు భార్య పార్వతమ్మకు సైతం కరోనాతో పాటు బ్లాక్‌ ఫంగస్‌ సోకగా ప్రస్తుతం విజయవాడలోనే చికిత్స పొందుతోంది. సాంబయ్యకు భార్యతో పాటు, ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబీకులు కరోనా బారిన పడడంతో సాంబయ్య భార్య సైతం పిల్లల్ని తీసుకుని విజయవాడలోనే ఉంటోంది. వారి పరిస్థితి తెలుసుకుని స్థానికులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని