ఇంకెవరూ పడకూడదని...
logo
Published : 18/06/2021 02:56 IST

ఇంకెవరూ పడకూడదని...

రహదారిని శుభ్రం చేస్తున్న నగరపాలక వాహనం నుంచి హైడ్రాలిక్‌ ఆయిల్‌ దారంతా కారింది. స్థానికులు డ్రైవరుకు చెప్పడంతో వాహనం పక్కకు తీసి నిలిపాడు. ఈలోపే ఆ ఆయిల్‌ పైనుంచి వెళ్లిన పలువురు వాహనచోదకులు జారి పడిపోయారు. దీంతో వాహన డ్రైవరు, ప్రమాదానికి గురైన చోదకులు, మహిళలు రక్షణగా నిలబడి ఆ ఆయిల్‌పై మట్టిని పోసి రాళ్లు అడ్డుగా పెట్టారు. విజయవాడ సాంబమూర్తి రోడ్డు బావాజీపేట వద్ద గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న సంఘటన ఇది.

-ఈనాడు, అమరావతి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని