ఆ హామీ జ‌గ‌న్ చేసిన పెద్ద మోసం: య‌న‌మ‌ల‌
logo
Updated : 19/06/2021 13:51 IST

ఆ హామీ జ‌గ‌న్ చేసిన పెద్ద మోసం: య‌న‌మ‌ల‌

అమ‌రావ‌తి: ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేక హోదా హామీ ఇవ్వ‌డ‌మే యువ‌త‌కు సీఎం జ‌గ‌న్  చేసిన పెద్ద మోస‌మ‌ని తెదేపా సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ధ్వ‌జ‌మెత్తారు. ఈడీ, సీబీఐ కేసుల‌తో జ‌గ‌న్ కేంద్ర ప్ర‌భుత్వానికి లొంగార‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా తీసుకురావ‌డం చేత‌కాద‌ని చేతులెత్తేసిన జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను ద‌గా చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీలో 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో పారిశ్రామిక‌, ఆర్థిక అభివృద్ధి దిగ‌జారి పోయాయ‌ని విమ‌ర్శించారు. నిరుద్యోగ రేటు 13.5కి పెరిగిపోయింద‌ని య‌న‌మ‌ల ఆక్షేపించారు. ప్రోత్సాహ‌కాలు లేక రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు రావ‌డం లేద‌న్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కాపాడ‌లేని వైకాపా ఎంపీల‌తో ఉప‌యోగం లేద‌ని.. వాళ్లంతా వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని