పోతిరెడ్డిపాడు..లిఫ్ట్‌ పెడితే తప్పేంటి: అనిల్‌
logo
Updated : 21/06/2021 16:05 IST

పోతిరెడ్డిపాడు..లిఫ్ట్‌ పెడితే తప్పేంటి: అనిల్‌

అమరావతి: కృష్ణానది నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ అక్రమ ప్రాజెక్టులు కడుతోందన్న తెలంగాణ ఆరోపణలను మంత్రి అనిల్‌కుమార్‌ కొట్టి పారేశారు. రాయలసీమలో కడుతున్న ప్రాజెక్టులన్నీ చట్టానికి లోబడినవేనని స్పష్టం చేశారు. తమకు కేటాయించిన నీటికి మించి చుక్క నీరుకూడా అదనంగా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. 6 టీఎంసీలకు పైగా సామర్థ్యమున్న పలు ప్రాజెక్టులను తెలంగాణ అనుమతి లేకుండా నిర్మిస్తోందన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్‌ పెడితే.. తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలంలో 881 అడుగుల నీరు చేరితేనే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే అవకాశముంటుందని, 848 అడుగుల నీటిమట్టం ఉంటే చుక్కనీరు కూడా తీసుకోలేమని వివరించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని 15 రోజులే తీసుకునే పరిస్థితి ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని