పీవీసీ కార్డులొచ్చాయ్‌
logo
Published : 22/06/2021 04:13 IST

పీవీసీ కార్డులొచ్చాయ్‌

ఈనాడు - అమరావతి

త ఎనిమిది నెలలుగా వేధిస్తున్న పీవీసీ కార్డులు వచ్చాయి. ఎట్టకేలకు రవాణా కార్యాలయానికి చేరాయి. ఎప్పటి నుంచో పేరుకుపోయిన లైసెన్సుల ముద్రణ ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని రవాణా కార్యాలయాల్లో పేరుకుపోయిన వాటిని ముద్రించాలంటే సెప్టెంబరు నెలాఖరు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో రోజుకు దాదాపు 400 డీఎల్‌, ఆర్సీలు జారీ అవుతుంటాయి. వీటిలో 250 వరకు డ్రైవింగ్‌ లైసెన్సులు, 150 వాహన ఆర్సీలు ఉంటాయి. వీటిని విజయవాడలోని డీటీసీ కార్యాలయంలో ముద్రించి, సంబంధిత దరఖాస్తుదారులకు పోస్టులో పంపిస్తారు. చిప్‌తో కూడిన పీవీసీ కార్డులను రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి జిల్లాలకు పంపిస్తుంటారు. కేంద్ర కార్యాలయంలోనే వీటికి కొరత ఏర్పడింది. దీంతో గతేడాది  అక్టోబరు 26 నుంచి ముద్రణ ఆగిపోయింది. బీ దీనికి ప్రత్యామ్నాయంగా డీఎల్‌, ఆర్సీలకు సంబంధించిన సాఫ్ట్‌కాపీలను రవాణా శాఖ వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. పలువురు వాటిని ప్రింట్‌ తీసుకుంటున్నారు. విజయవాడ పరిధిలో మొత్తం 1.10 లక్షలు ముద్రణకు నోచుకోలేదు. జిల్లాలోని మిగిలిన కార్యాలయాల్లో 60వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ కార్డు సమస్య పరిష్కారం కావడంతో జిల్లాకు తొలి విడతగా 50వేలు కార్డులు వచ్చాయి. వీటిని విజయవాడ ఆర్టీవో కార్యాలయానికి కేటాయించారు. దశల వారీగా మరికొన్ని రానున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని