రూ.70 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు
logo
Published : 22/06/2021 04:13 IST

రూ.70 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు

మాట్లాడుతున్న ఛైర్మన్‌ సోమినాయుడు, పక్కన ఈవో భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రూ.70కోట్లతో ఇంద్రకీలాద్రిపై శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపడతామని దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు. సోమవారం మల్లికార్జున మహా మండపంలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఎజెండాలోని 43 అంశాలతో పాటు ఇతర అంశాలపై సభ్యులు చర్చించారు. సోమినాయుడు మాట్లాడుతూ కనకదుర్గానగర్‌లో ఉన్న గోశాల స్థలాన్ని నిర్వాహకులతో మాట్లాడి వారికి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చి అక్కడ శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టే ఆలోచన కూడా ఉందన్నారు. దేవస్థానం ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ  ఈ హుండీ ద్వారా దేవస్థానానికి రూ.34 లక్షలు ఆదాయం సమకూరిందన్నారు. దేవస్థానం ఈఈ భాస్కర్‌, ఏఈవోలు రమేష్‌, వెంకటరెడ్డి, తిరుమలరావు, పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే ఆర్‌ శివప్రసాదరెడ్డి, వెంకటరమణ, అంబిక, జ్యోతి, చంద్రకళ, రాజ్యలక్ష్మి, శ్రీదేవి, ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతమ్మ ఆలయ దర్శన వేళల్లో మార్పులు
పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం దర్శనం వేళల్లో మంగళవారం నుంచి మార్పులు చేసినట్లు ఈవో ఎన్వీఎస్‌ఎన్‌ మూర్తి సోమవారం తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని