ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధం
logo
Published : 22/06/2021 04:13 IST

ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధం

మాట్లాడుతున్న పుల్లెల గోపీచంద్‌

నూజివీడు, న్యూస్‌టుడే: యోగా, ధ్యానంతో మందులు అవసరం లేకుండా మనిషి ఆరోగ్యంతో ఉండవచ్చని, శారీరక దారుఢ్యానికి యోగా దివ్య ఔషధమని ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సోమవారం నూజివీడు ట్రిపుల్‌ఐటీ, యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో డైరెక్టర్‌ ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన నూజివీడు ట్రిపుల్‌ఐటీలో వర్చువల్‌గా నిర్వహించారు. గౌరవ అతిథిగా హాజరైన గోపీచంద్‌ మాట్లాడుతూ.. కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. ఆర్జీయూకేటీ ఉప కులపతి కె.హేమచంద్రారెడ్డి, నేషనల్‌ యోగాసన స్పోర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి డా.జైదీప్‌ఆర్య మాట్లాడారు. స్థానిక విద్యార్థుల రిథమిక్‌ యోగా వీడియోని ప్రదర్శించారు. శిక్షకుడు అక్కినేని సత్యశ్రీధర్‌ యోగా ప్రోటోకాల్‌ని అందరిచేత చేయించారు. డీన్‌ (అకడమిక్‌) శ్రావణి, డీన్‌ (వెల్ఫేర్‌) విజయశ్రీ, వ్యాయామ అధ్యాపకులు నవీన్‌, సుబ్బలక్ష్మి, తదితరులున్నారు.     

ఆసనాలు వేస్తున్న యువకులు, డప్పు కళాకారులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం మహాత్మాగాంధీ రోడ్డులోని బాపు మ్యూజియంలో నిర్వహించిన యోగాసనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అజాదీ క అమృత్‌ మహోత్సవంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భాషా సాంస్కృతికశాఖ, సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కల్చరల్‌ సెంటర్‌ (నాగ్‌పూర్‌), పురావస్తు-మ్యూజియంల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.  శివసాయికుమార్‌, కృష్ణవేణి, కుమారి రామచైతన్యల ఆధ్వర్యంలో యోగాసనాలు నిర్వహించారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరావు యోగా ప్రాశస్త్యం గురించి వివరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని