విద్యుత్తు సౌధ వద్ద అగ్ని ప్రమాదం
logo
Published : 22/06/2021 04:13 IST

విద్యుత్తు సౌధ వద్ద అగ్ని ప్రమాదం

ఎగసిపడుతున్న మంటలు

గుణదల, న్యూస్‌టుడే: గుణదల విద్యుత్తు సౌధలోని జిల్లా స్టోర్స్‌ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ నిరుపయోగంగా ఉన్న మీటర్‌ బాక్సుల వద్ద తొలుత మంటలు చెలరేగంతో చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్మేసింది. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాదంలో రూ.20 వేల వరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని