Ap News: ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష
logo
Updated : 22/06/2021 18:48 IST

Ap News: ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష

అమరావతి: హైకోర్టు ఆదేశాలను పాటించలేదని ఇద్దరు ఉన్నతాధికారులకు వారం రోజుల జైలుశిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మాసనం ఉత్తర్వులను రేపు సాయంత్రంలోగా  అమలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు లిఖితపూర్వక హామీ ఇవ్వటంతో జైలు శిక్ష ఉత్తర్వులను ఉపసంహరించారు.

విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 36 మందిని రెగ్యులరైజ్‌ చేయాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఐఎఫ్ఎస్‌ అధికారి చిరంజీవి చౌదరి, ఐఏఎస్‌ అధికారి గిరిజాశంకర్‌ ఆ ఉత్తర్వులు అమలుపరచలేదు. దీంతో బాధితులు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈరోజు ఇద్దరు అధికారులు కోర్టు ముందు హాజరు హాజరుకావాలని గత విచారణలో ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌లు కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన ధర్మాసనం.. ఉత్తర్వులు అమలు చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు అధికారులకు వారం రోజుల జైలు శిక్ష విధించింది. ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రేపు సాయంత్రం లోపు అమలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది లిఖితపూర్వక హామీ న్యాయస్థానానికి ఇవ్వటంతో జైలు శిక్ష ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని