నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బదిలీ
logo
Published : 23/06/2021 05:36 IST

నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బదిలీ

ప్రతిష్ఠ మంగైన్‌

నూజివీడు, న్యూస్‌టుడే: నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ప్రతిష్ఠ మంగైన్‌ తన స్వీయ అభ్యర్థ.న మేరకు ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ నుంచి ఛత్తీస్‌గడ్‌ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. ఆమెను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఆమె 2020 ఆగస్ట్‌ 17న నూజివీడు సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీ, మున్సిపల్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలను సమర్థ.వంతంగా నిర్వహించారు. డివిజన్‌లో కరోనా నియంత్రణ, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని