చంద్రిక తండ్రులకు దూరంగా..
logo
Published : 23/06/2021 05:36 IST

చంద్రిక తండ్రులకు దూరంగా..

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే:  చిన్నారులు ముగ్గురూ ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. వరుసకు బంధువులు అవుతారు. పక్క పక్క ఇళ్లల్లో ఉండే పిల్లలు మృత్యువులోనూ స్నేహ బంధాన్ని వీడలేదు. రెండు కుటుంబాల సభ్యులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. శశిక, చంద్రికల తల్లిదండ్రులు కగ్గా మురళి, జ్యోతి సుమారు 3 ఏళ్ల నుంచి, జగదీష్‌ తల్లిదండ్రులు గండికోట వెంకట్రావు, పంగిడమ్మ దాదాపు 7 సంవత్సరాల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలు కొన్నేళ్లుగా తండ్రులకు దూరమయ్యారు. మురళీ, జ్యోతిలకు ఇద్దరే పిల్లలు కాగా ఇద్దరూ చనిపోయారు. వెంకట్రావు, పంగిడమ్మలకు ఒకే కొడుకు కాగా అతను మృత్యువాత పడ్డాడు. వారి తల్లులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. బొద్దనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురూ చదువుతున్నారు. చాలా చురుకైన విద్యార్థులని, బాగా చదివే చిన్నారులు మృత్యువాత పడటం కలచి వేసిందని ప్రధానోపాధ్యాయుడు యూఆర్‌కే రాజు ఆవేదన వ్యక్తం చేశారు. జగదీష్‌ సుమారు పది రోజుల కిందట వాగులో ఆడుకోవడానికి వెళ్లాడు. అప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నా... ఇప్పుడు మృత్యువు కాటేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని