బోర్డుల్లోనే నిషేధం
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

బోర్డుల్లోనే నిషేధం

ఈనాడు, విజయవాడ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం..ఆలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్ల వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ దుర్గమ్మ ఆలయంలో మాత్రం భక్తులు సెల్‌ఫోన్లు ఇష్టానుసారంగా వాడుతున్నారు. వీటిని కట్టడి చేయడంలో ఆలయసిబ్బంది పూర్తిగా విఫలమవుతున్నారు. దేవస్థానం పైకి వచ్చేటప్పుడే క్యూలైన్లో చెకింగ్‌ చేయడంలో లోపాలతో పాటు, సెల్‌ఫోన్లు డిపాజిటు చేసుకుని ఆలయంలోకి వెళ్లలనే నిబంధనలు భక్తులకు చేరకపోవడంతో ఇలా జరుగుతోంది. మహా మండపం, అమ్మవారి అంతరాలయంలో దగ్గర్లో సైతం భక్తులు సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులు కొంతమంది సెల్ఫీలు దిగుతూ కనిపిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని