ప్రకాశం బ్యారేజీ 5 గేట్ల మూసివేత
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

ప్రకాశం బ్యారేజీ 5 గేట్ల మూసివేత

సముద్రంలోకి 47,905 క్యూసెక్కులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కృష్ణా నది దిగువున ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తీవ్రత ఆదివారం మరింత తగ్గింది. ఈ నేపథ్యంలో రాత్రి 9 గంటలకు 5 గేట్లను మూసివేశారు. 65 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 47,905 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి 47,287 క్యూసెక్కులు వస్తోంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో 70 గేట్ల ద్వారా (ఒక అడుగు మేర ఎత్తి) 51,940 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి 56,857 క్యూసెక్కులు వస్తుండగా, ఆ తర్వాత తగ్గింది. కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు 3,631 క్యూసెక్కులు ఇస్తున్నారు.

ఉదయం నుంచి ప్రవాహం ఇలా..

ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 82,651 క్యూసెక్కులు రాగా, 40 గేట్లను రెండు అడుగులు, 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 81,090, కాల్వలకు 1,762 క్యూసెక్కులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు ఎగువ నుంచి వచ్చే వరద 54,424 క్యూసెక్కులకు తగ్గడంతో, 70 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 51,800, కాల్వలకు 2,624 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి వచ్చే వరద 50,840 క్యూసెక్కులకు తగ్గగా, సముద్రంలోకి 51,940, కాల్వలకు 3,631 క్యూసెక్కులను విడుదల చేశారు. రాత్రి 8 గంటకు పులిచింతల నుంచి 15,892, పాలేరు నుంచి 8,475, కీసర (మునేరు) నుంచి 32,490 వెరసి.. 56,857 క్యూసెక్కుల మేర వరద బ్యారేజీకి వస్తోంది. రాత్రి 9 గంటలకు 47,287 క్యూసెక్కులకు తగ్గింది.

కేఈ ప్రధాన కాల్వకు 2,915 క్యూసెక్కులు

బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు (కేఈ) ప్రధాన కాల్వకు 2,915, కృష్ణా పశ్చిమ (కేడబ్ల్యూ) ప్రధాన కాల్వకు 716.. వెరసి 3,631 క్యూసెక్కులు ఇస్తున్నారు. కేఈ ప్రధాన కాల్వ నుంచి రైవస్‌ కాల్వకు 1000, బందరు కాల్వకు 1011, ఏలూరు కాల్వకు 454, కేఈబీ కాల్వకు 450 క్యూసెక్కులు విడుదల చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని