నేటి నుంచి ‘స్పందన’ మొదలు
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

నేటి నుంచి ‘స్పందన’ మొదలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజల సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. కరోనాతో 2020 మార్చి నుంచి ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆన్‌లైన్‌, 1902 నంబర్లు, సీఎంవో నుంచి వచ్చిన అర్జీలను అధికారులు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరలా రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తోంది.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కొనసాగింపు.. జిల్లా పాలనాధికారి వివేక్‌యాదవ్‌ రెండు నెలల నుంచి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా ప్రజలు వారి సమస్యలను తెలియజేసే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ నేరుగా అర్జీదారులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలిస్తున్నారు. ఇప్పుడు స్పందన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని కూడా యథావిధిగా కొనసాగించాలని పాలనాధికారి నిర్ణయించారు. దీంతో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌, అనంతరం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్‌, ఇతర అధికారులు స్వీకరించనున్నారు. గతంలో జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో జరిగే స్పందన కార్యక్రమాన్ని ఇప్పుడు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాలులోకి మార్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని