ప్రతి బుధవారం ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

ప్రతి బుధవారం ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’


రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎస్పీకి తెలియజేయడానికి గ్రామీణ గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యలపై స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. అయితే దూర ప్రాంతాల ప్రజలు, మహిళలు, వృద్ధులు పోలీసు కార్యాలయానికి రావడానికి వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి ఫోన్‌ ద్వారా విన్నవించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమంలో రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ పాల్గొని ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడతారు. సమస్యల పరిష్కారానికి వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. ఈసందర్భంగా ఆదివారం ఎస్పీ విశాల్‌గున్నీ విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సెల్‌ నంబర్‌ 8688405050 కేటాయించినట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని