నేటి నుంచి కలెక్టరేట్‌లో ‘స్పందన’
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

నేటి నుంచి కలెక్టరేట్‌లో ‘స్పందన’


కలెక్టర్‌ నివాస్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీ సోమవారం నుంచి నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్టు వివరించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించాలని పేర్కొన్నారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని వివరించారు. నేరుగా అర్జీలు అందజేయవచ్చన్నారు.

సచివాలయాల్లోనే ఇవ్వండి.. ఆయా గ్రామాలు, పట్టణాల నుంచి డివిజన్‌ కేంద్రాలకు వ్యయ, ప్రయాసలతో వచ్చే కంటే స్పందన అర్జీలను స్థానికంగా గ్రామ/వార్డు సచివాయాల్లోనే అందజేయాలని విజయవాడ సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌, నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మిలు వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్పందన వినతులను సబ్‌కలెక్టర్‌ కార్యాలయాల్లో ఇచ్చినా, స్థానికంగా సచివాలయాల్లో ఇచ్చినా పరిష్కార మార్గం ఒకటేనన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో దూరాభారం వచ్చి ఇబ్బందులు పడే కంటే, సచివాలయాల్లోనే వినతులు ఇవ్వడం మంచిదని సూచించారు. అతి ముఖ్యమైన సమస్యలతో బాధ పడుతున్న వృద్ధులు డివిజన్‌ కార్యాలయాలకు వచ్చి వినతులు అందించవచ్చని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని