ఉపాధ్యాయులకు టీకా తప్పనిసరి: డీఈవో
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

ఉపాధ్యాయులకు టీకా తప్పనిసరి: డీఈవో

మచిలీపట్నం: జిల్లాలోని ఉపాధ్యాయులు, సిబ్బంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించుకోవాలని డీఈవో తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 16న పాఠశాలలు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున ఆసమయానికి అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ టీకా వేసుకుని హాజరు కావాలన్నారు. ఇంకా మొదటి డోసు వేయించుకోని వారు ఉంటే ఈనెల 26 సోమవారం మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నందున తమ ప్రాంతాల్లోని సచివాలయాలకు వెళ్లి టీకా వేయించుకోవాలని సూచించారు. ఈనెల 27న తమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది నూరుశాతం వ్యాక్సినేషన్‌ వేయించుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఎమ్యీవోలు, డీవైఈవోలకు నివేదిక ఇవ్వాలని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని