ఓ బాటసారి... ఇది గ్రామీణ రహదారి
eenadu telugu news
Updated : 26/07/2021 06:22 IST

ఓ బాటసారి... ఇది గ్రామీణ రహదారి

చిత్రంలోని రహదారిని చూశారా. దీని దుస్థితి చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అంచనా వేయొచ్ఛు తోట్లవల్లూరు మండలం పాములలంక గ్రామంలోని ప్రధాన రహదారి ఇది. ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం, ఆర్‌సీయం పాఠశాలకు వెళ్లాలన్నా.. మండల కేంద్రానికి రాకపోకలు చేయాలన్నా ఈ దారే ఆధారం. దశాబ్దం క్రితం తారురోడ్డుగా అభివృద్ధి చేశారు. సరైన మురుగు కాల్వ లేక ఇటీవల కురిసిన వర్షాలకు బురద, నీరు నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు రాకపోలకు నరక యాతన అనుభవిస్తున్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌. ప్రవీణ్‌చంద్‌ ఆదివారం రాత్రి ఈ రహదారిని పరిశీలించారు. కన్వర్జెన్సీ నిధులు వచ్చిన వెంటనే రహదారి అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

- న్యూస్‌టుడే, పాములలంక (తోట్లవల్లూరు)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని