నేడు కొవిడ్‌ టీకా మెగా డ్రైవ్‌
eenadu telugu news
Published : 26/07/2021 03:54 IST

నేడు కొవిడ్‌ టీకా మెగా డ్రైవ్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, వైద్యం, న్యూస్‌టుడే : జిల్లాలో సోమవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ జె.నివాస్‌, డీఎంహెచ్‌ఓ సుహాసిని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇప్పటి వరకు మొదటి డోస్‌ తీసుకోని గర్భిణులు, బాలింతలు, ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికులు, నర్సింగ్‌ సిబ్బంది, హెల్త్‌ కేర్‌ వర్కర్లకు తొలి విడత టీకా వేయనున్నట్టు పేర్కొన్నారు. మొదటి విడత డోస్‌ తీసుకుని, అర్హులైన వారికి రెండో డోస్‌ టీకా వేస్తామని వివరించారు. సమీప వాలంటీర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలను సంప్రదించాలని ఆయన సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని