చిరివాడలో అవార ఏరువాక పరుగు
eenadu telugu news
Published : 26/07/2021 04:13 IST

చిరివాడలో అవార ఏరువాక పరుగు


మొక్కలు నాటుతున్న అవార సభ్యులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ‘చిరివాడ’ కుగ్రామంలో అవార(అమరావతి వాకర్స్‌, రన్నర్స్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో ఆదివారం అవార సభ్యులతో పాటు పలువురు స్థానిక చిన్నారులు రెండు కిలోమీటర్ల ఏరువాక పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని ప్రవాసాంధ్రుడు డాక్టర్‌ రవి వేలూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి అశోక్‌, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పర్యావరణవేత్త, అవార వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ అజయ్‌ కాట్రగడ్డ మాట్లాడుతూ భావిపౌరుల మనోవికాసానికి, పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇటువంటి పరుగు తోడ్పడుతుందన్నారు. ‘ఈ ఊరూరా పరుగు.. వాడవాడలా ఏరువాక’ అవార ప్రతి నెల నిర్వహించనుందన్నారు. గ్రామ సర్పంచి అశోక్‌.. వేకువజామునే విజయవాడ నుంచి ఎంతో ప్రయాసకోడ్చి చిరివాడ కుగ్రామానికి విచ్చేసిన అవార బృందాన్ని కొనియాడుతూ వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 1500 మొక్కలు, విత్తనాలు గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంతో పాటు ఖాళీ ప్రదేశాల్లో పిల్లలు, గ్రామస్థులు నాటారు. పలువురు అవార వాలంటీర్లు, హరికృష్ణ, రాజేశ్వరి (గుంటూరు), రవితేజ (హైదరాబాద్‌), శకుంతల, వైష్ణవి (ఏలూరు), గ్రామ ఉపాధ్యాయులు రవి, రంగారావు, గ్రామస్తులు సూర్యారావు, పూజారి రమేష్‌, భారతి, ఆదాం, మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని