సూర్యారావుపేట పీఎస్‌ పరిధిలో నిషేధాజ్ఞలు
eenadu telugu news
Published : 26/07/2021 04:13 IST

సూర్యారావుపేట పీఎస్‌ పరిధిలో నిషేధాజ్ఞలు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌, మెట్రోపాలిటన్‌ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ బి.శ్రీనివాసులు తెలిపారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌రోడ్డు, రైతుబజారు రోడ్డు, గోపాలరెడ్డిరోడ్డు, నక్కల రోడ్డు, డోర్నకల్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ నెల 26 నుంచి సెప్టెంబరు 18 వరకు మొత్తం 55 రోజుల పాటు ఈ సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న సమయంలో పై ప్రదేశాలకు 250 మీటర్ల పరిధిలో అయిదుగురు లేదా అంతకు మించి జనం గుమికూడరాదు. కర్రలు, రాళ్లు ఇతర మారణాయుధాలు పట్టుకుని తిరగరాదు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని