పాడి రైతులకు నగదు చెల్లించండి
eenadu telugu news
Published : 26/07/2021 04:13 IST

పాడి రైతులకు నగదు చెల్లించండి

పటమట, న్యూస్‌టుడే: అక్రమ కేసుల నుంచి విముక్తి పొందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాడి రైతులను అమూల్‌ సంస్థకు తాకట్టు పెట్టినట్లుగా ఉందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆటోనగర్‌ జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం పాడి రైతుల బకాయిలు తక్షణం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా గుజరాత్‌ అమూల్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాదయాత్రలో పాడి రైతులకు లీటర్‌ పాలకు రూ.4 పెంచుతానని హామీ ఇచ్చి, నేడు అమూల్‌ పేరుతో రూ.5 నుంచి రూ.7 వరకు తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. గత ఆరు మాసాలుగా సాంకేతిక ఇబ్బందులు అని చెప్పి పాడి రైతులకు డబ్బు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని, అమూల్‌ పేరుతో పాడి రైతుల పొట్ట కొడుతున్నారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని