పులిచింతలలో 43.64 టీఎంసీల నీరు
eenadu telugu news
Updated : 27/07/2021 05:45 IST

పులిచింతలలో 43.64 టీఎంసీల నీరు

అచ్చంపేట, న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టులో సోమవారం సాయంత్రం 43.64 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈఈ రాజశేఖర్‌ తెలిపారు. విద్యుదుత్పత్తికి తెలంగాణ జన్‌కో 10,000 క్యూసెక్కులు వినియోగించుకుంటుందన్నారు. ఇన్‌ఫ్లో 10,600 క్యూసెక్కులు కాగా అవుట్‌ ఫో 10;600 క్యూసెక్కులుగా ఉందన్నారు. ప్రసుత్తం ప్రాజెక్టు లో వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టిందన్నారు.


కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

దుగ్గిరాల: కృష్ణా పశ్చిమ డెల్టాకు సోమవారం 816 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అందులో రేపల్లె కాల్వకు 200, తూర్పు కాల్వకు 120, పశ్చిమ కాల్వకు 60, కొమ్మమూరు కెనాల్‌కు 350 క్యూసెక్కుల వంతున ఇచ్చారు. ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం 12 అడుగులుండగా అక్కడి నుంచి నదిలోకి 33,615 క్యూసెక్కులు వదులుతున్నారు.


సముద్రంలోకి 29,480 క్యూసెక్కులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కృష్ణా నది దిగువున వరద ప్రవాహం సోమవారం మరింత తగ్గింది. రాత్రి 9 గంటలకు 40 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి, 29,480 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు 4,322 క్యూసెక్కులు ఇస్తున్నారు. వరద క్రమేపీ తగ్గడంతో ఉదయం 6 గంటలకు పది గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు 25 గేట్లు, రాత్రి 8 గంటలకు 30 గేట్లను మూసి వేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని