ఈతకు దిగి బాలుడి మృతి
eenadu telugu news
Updated : 27/07/2021 06:26 IST

ఈతకు దిగి బాలుడి మృతి


వినోద్‌ మృతదేహాన్ని తీసుకొస్తున్న మత్స్యకారులు

మందడం (తుళ్ళూరు), న్యూస్‌టుడే: ఈత సరదా ఓ బాలుడి ఉసురు తీసిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన మేరకు.. మండలంలోని మందడం గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి కె.వినోద్‌ (15) సోమవారం కృష్ణా నది పుష్కరఘాట్‌ వద్ద ఆటలాడుకునేందుకు నలుగురు మిత్రులతో కలిసి వెళ్లాడు. అనంతరం ఈత కొట్టడానికి నదిలో దిగగా, వినోద్‌ నీట మునిగిపోయాడు. భయాందోళనకు గురైన మిత్రులు దగ్గరలోని మత్స్యకారులకు విషయం చెప్పారు. వారు నదిలో దూకి వినోద్‌ కోసం గాలించారు. కొద్దిసేపటికి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. నిర్జీవుడైన కొడుకును చూసి తల్లిదండ్రులు కె.నాగరాజు, శివ కన్నీరుమున్నీరయ్యారు. వారికి వినోద్‌తో పాటు మరో ఇద్దరు మగ, ఒక ఆడపిల్ల ఉన్నారు. బాలుడి మృతదేహాన్ని అమరావతి ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని