29న అండర్‌-19 బాలుర క్రికెట్‌ జట్టు ఎంపిక
eenadu telugu news
Published : 27/07/2021 05:08 IST

29న అండర్‌-19 బాలుర క్రికెట్‌ జట్టు ఎంపిక

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 29న అండర్‌-19 బాలుర జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి శరత్‌కుమార్‌ సోమవారం తెలిపారు. అరండల్‌పేట పిచుకలగుంట శివాజీ మైదానంలో ఎంపికలు జరుగుతాయన్నారు. క్రీడాకారులు 2002, సెప్టెంబర్‌ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని, జనన ధ్రువీకరణ పత్రంతో పాటు ఫాం-5 ఒరిజినల్‌ తీసుకురావాలన్నారు. వ్యాక్సినేషన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ చూపించాలన్నారు. 18 సంవత్సరాల వయసు నిండినవారే అర్హులని, తెలుపు రంగు డ్రస్‌, షూస్‌ వేసుకుని ఎవరి క్రికెట్‌ కిట్టు వారు తీసుకుని ఎంపికలకు హాజరుకావాలని సూచించారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని