మళ్లీ ముసిరిన మేఘం..
eenadu telugu news
Published : 27/07/2021 05:34 IST

మళ్లీ ముసిరిన మేఘం..

పలు మండలాల్లో భారీ వర్షం..

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాను మళ్లీ మేఘాలు కమ్మేశాయి. ఫలితంగా పలు మండలాల్లో భారీ, మిగతా ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 453.1 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 9.1 మి.మీ.గా ఉంది. బాపులపాడు, మండవల్లిలలో అత్యధికంగా 32.4 మి.మీ., ఉయ్యూరులో అత్యల్పంగా 0.2 మి.మీ. పడింది. కైకలూరులో 31.4, నందివాడ 25.4, ఆగిరిపల్లి 23.2, జి.కొండూరు, పెదపారుపూడి 22, కలిదిండి 19.6, ముదినేపల్లి 17.2, మొవ్వ 17, నూజివీడు 16.8, మైలవరం 16.4, ముసునూరు 16.2, గుడివాడలో 15.6, మచిలీపట్నం 12.6, విజయవాడ 12.2, వీరులపాడు 11.2, పెనమలూరు 10.4, రెడ్డిగూడెం 9.2, నందిగామ 8.2, గుడ్లవల్లేరు 7.8, ఉంగుటూరు 7.2, వత్సవాయి 6.2, ఇబ్రహీంపట్నం 5.4, బంటుమిల్లి 4.7, చాట్రాయి 4.6, విస్సన్నపేట, కంకిపాడు 4.2, గూడూరు, తిరువూరు 4, కంచికచర్ల, కృత్తివెన్ను 3.4, జగ్గయ్యపేట 2.8, చందర్లపాడు 1.2, ఎ.కొండూరు, తోట్లవల్లూరు 1, ఘంటసాలలో 0.6 మి.మీ. మేర వర్షం పడింది. మిగతా మండలాల్లో వర్ష ఛాయలు లేవు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని