ఒక్క రోజు.. 82,562 టీకాలు
eenadu telugu news
Published : 27/07/2021 05:34 IST

ఒక్క రోజు.. 82,562 టీకాలు

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లాలో కొవిడ్‌ వాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఒకేరోజు 82,562మందికి కొవిడ్‌ టీకాలు వేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వాక్సినేషన్‌ జరిగింది. అత్యధికంగా కోవిషీల్డ్‌, కొద్దిగా కోవాగ్జిన్‌ టీకాలను వేశారు. కోవిషీల్డ్‌ టీకాలను 81,062 మందికి వేయగా.. వీరిలో 69,289మంది మొదటి డోసు, 11,773మంది రెండో విడత వాళ్లున్నారు. కోవాగ్జిన్‌ టీకాలను జిల్లాలోని 1500 మందికి వేశారు. వీరిలో మొదటి డోసు వాళ్లు 325, రెండో డోసు వాళ్లు 1175మంది ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 18,62,861మందికి టీకాలను వేసినట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. వీరిలో కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 2,34,364, ఆరోగ్య కార్యకర్తలు 79,909మంది ఉన్నారు. 45ఏళ్లు దాటిన 12,63,975మందికి టీకాలు వేశారు. 18 నుంచి 40 మధ్యలో ఉన్న 36,750మంది ఇప్పటివరకు టీకాలు వేయించుకున్నారు. వీరుకాకుండా ఉపాధ్యాయులు 63,109, చిన్నపిల్లల తల్లులు 1,84,754మందికి కొవిడ్‌ టీకాలను వేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని