చిట్టి చిట్టి రోబో... ఫుడ్డు పెట్టే రోబో
eenadu telugu news
Updated : 27/07/2021 12:03 IST

చిట్టి చిట్టి రోబో... ఫుడ్డు పెట్టే రోబో

హోటల్‌లో ఆకట్టుకుంటున్న సేవలు

వినియోగదారునికి ఆహార పదార్థాలను అందిస్తున్న రోబో

విజయవాడ మొగల్రాజపురంలోని ఓ రెస్టారెంట్‌లో రోబో సేవలు వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి. లోనికి వచ్చే అతిథులకు స్వాగతం పలకడం, సిద్ధం చేసిన ఆహారాన్ని నేరుగా వారి టేబుల్‌ వద్దకు తీసుకెళ్లి అందిస్తున్నాయి. ఒక్కో యంత్రం ఖరీదు రూ.6 లక్షల వరకు ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వీటిని రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ అమరిక బట్టి ప్రత్యేకంగా మ్యాపింగ్‌ చేసి సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తారు. కావాల్సిన ఐటమ్స్‌ను నేరుగా చెప్పే వెసులుబాటూ ఉంది. అయితే కోడింగ్‌తో వారు గందరగోళానికి గురవకుండా ప్రస్తుతానికి ఆహారం తీసుకెళ్లి ఇచ్చే సదుపాయమే అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

- న్యూస్‌టుడే, విజయవాడ సిటీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని