ఆక్సిజన్‌ వెన్నంటే...
eenadu telugu news
Published : 27/07/2021 05:34 IST

ఆక్సిజన్‌ వెన్నంటే...

చిత్రంలో కన్పిస్తున్న వ్యక్తి బాపులపాడు తహసీల్దార్‌ సీహెచ్‌ నరసింహారావు.. ఏప్రిల్‌ నెలలో కరోనా బారిన పడ్డారు. 48 రోజులు ఆసుపత్రిలో ఐసీయూలోనే ఉండి చికిత్స పొందారు. అనంతరం మరో 15 రోజులూ వైద్యశాలలోనే ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీన తిరిగి విధుల్లో చేరిన ఆయన.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆక్సిజన్‌ అందడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఇంట్లోనే కాకుండా, కార్యాలయంలోనూ, వాహనంలోనూ ఆక్సిజన్‌ సిలిండర్లు పెట్టుకున్నారు. అప్పుడప్పుడు శ్వాస అందకపోవడం వలన ఇబ్బంది పడుతున్నానని, అందుకే ఈ ఏర్పాట్లని చెబుతున్నారు.

- న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని