జోరుగా మిర్చి క్రయవిక్రయాలు
eenadu telugu news
Published : 29/07/2021 04:41 IST

జోరుగా మిర్చి క్రయవిక్రయాలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: మిర్చి క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం మిర్చియార్డుకు రైతులు 50,007 బస్తాలు తరలించారు. ఈ-నామ్‌ పద్ధతిలో 50,672 బస్తాలు క్రయవిక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 10,805 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాణ్యత కలిగిన తేజ, బాడిగ, 334, 355, సూపర్‌ 10 రకాల మార్కెట్‌ రూ.200 వరకు పెరిగిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర మిర్చి రకాలతో పాటు డీలక్స్‌ రకాల విక్రయాలు బాగున్నాయి. నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి రూ.14,000 ఉండగా, స్పెషల్‌ వెరైటీ తేజ రూ.7,000 నుంచి రూ.15,500, బాడిగ రూ.7,000 నుంచి రూ.16,800, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.8,500 ధర లభించింది. ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి 14,000 ఉండగా, తేజ రూ.7,000 నుంచి రూ.15,300, బాడిగ రూ.8,000 నుంచి రూ.17,000, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.8,300 ధర లభించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని