ఆకు కూరలతో ఆరంభించండి..
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

ఆకు కూరలతో ఆరంభించండి..

 

విచక్షణ రహితంగా పురుగు మందులను వాడుతుండటంతో ఆరోగ్యాన్ని పంచే కూరగాయలు, పండ్లే వినియోగదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. మన కుటుంబానికి అవసరమయ్యే ఆరోగ్యకరమైన తాజా కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండించేందుకు ఇంటి పంటకు మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి పెరటిలో లేదా టెర్రస్‌పైన, బాల్కనీల్లోనే వీటిని పెంచుకోవచ్ఛు కొద్దిపాటి శ్రమ, సమయం కేటాయించి నిత్యం నవనవలాడే కూరగాయలను పొందవచ్ఛు ఇంటిపంట సాగు మొదలు పెట్టాలనుకునే ఔత్సాహికులు.. సులువుగా పండించగలిగి, త్వరగా చేతికందే ఆకుకూరలతో సాగు మొదలు పెట్టడం శ్రేయస్కరం. వీటి పెంపకంలో కొంత పట్టుచిక్కిన తర్వాత క్రమంగా స్వల్ప, దీర్ఘకాలిక రకాలైన కూరగాయలు, పండ్ల మొక్కల సాగు చేపట్టవచ్ఛు పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలి, చుక్కకూర, గంగపాయలకూర, పొన్నగంటికూర, కొత్తిమీర, పూదీన వంటివి విత్తిన సుమారు 30-40 రోజులకు పంటనిస్తాయి. ఒక పంటనే తీసుకోవాలనుకుంటే విత్తనాలను ఒత్తుగా విత్తి, పంటను వేర్లతో సహా పీకేయాలి. 3-5 కోతలు తీయాలనుకుంటే మాత్రం.. మొక్కలను కొంత ఎడంగా విత్తి, ఆకులను మాత్రమే కోసుకోవాలి. జులై మాసంలో అన్ని రకాల ఆకుకూరలను సాగు చేయవచ్ఛు అయితే వీటిని నీడలో కాకుండా ఎండపడే ప్రదేశంలో పెంచితే మంచిది. వీలుకాని పక్షంలో కొంత సమయమైనా ఎండపడేలా జాగ్రత్త వహించాలి. వీటిని 25x30 సెం.మీ ఎడంగా విత్తాలి. ఒక చ.మీ. విస్తీర్ణంలో విత్తేందుకు 2-2.5 గ్రా. విత్తనం సరిపోతుంది. ఈ స్థలంలో విత్తిన పాలకూర, గోంగూర, తోటకూరల నుంచి సుమారుగా 1-1.5 కిలోల దిగుబడి వస్తుంది.

- అన్నదాత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని