ఉపాధి పథకంతో గ్రామాల అభివృద్ధి
eenadu telugu news
Published : 29/07/2021 05:56 IST

ఉపాధి పథకంతో గ్రామాల అభివృద్ధి


మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఊతంగా నిలుస్తుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు శ్రీనివాసరెడ్డి అన్నారు. గుంటూరు డివిజన్‌కు చెందిన గ్రామాల సర్పంచులకు జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చూడటం ద్వారా మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు పంచాయతీలకు జమవుతాయన్నారు. జడ్పీ సీఈవో చైతన్య మాట్లాడారు. సమావేశంలో డీపీఆర్‌సీ సిబ్బంది, సర్పంచులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని