అటవీ ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకారం
eenadu telugu news
Published : 29/07/2021 18:51 IST

అటవీ ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకారం

అమరావతి: పులుల అభయారణ్యంలో సంరక్షణా చర్యలను పటిష్ఠంగా కొనసాగించాలని సీఎం జగన్‌ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. టైగర్‌ రిజర్వు ప్రాంతాల్లో అధికారులు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకారం తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు  కార్యాలయంలో ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా పులుల సంఖ్య 47 నుంచి  63కి పెరిగిందని పీసీసీఎఫ్‌ ప్రదీప్‌ కుమార్‌ సీఎంకు వివరించారు. నల్లమల నుంచి శేషాచలం అటవీప్రాంతాల వరకు అవి ప్రయాణిస్తున్నట్టు వివరించారు. కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని సీఎంకు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని