పెరుగుతున్న వరద
eenadu telugu news
Published : 31/07/2021 04:28 IST

పెరుగుతున్న వరద

బ్యారేజీ వద్ద 30 గేట్లు ఎత్తివేత

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కృష్ణా నది దిగువున.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారం వరద పెరిగింది. ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. రాత్రి 9 గంటలకు బ్యారేజీకి 30 వేల క్యూసెక్కులు రాగా, 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. 22,500 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 10,468 క్యూసెక్కులు రాగా, నాలుగు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 10,353 క్యూసెక్కులు, కాల్వలకు 2,900 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు 17,317 క్యూసెక్కులు రాగా, 9 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 6,705, కాల్వలకు 7,912 క్యూసెక్కుల చొప్పున వదిలారు. రాత్రి ఏడు గంటలకు మరింత పెరిగి 22,814 క్యూసెక్కులు రాగా, 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి, సముద్రంలోకి 10,458 క్యూసెక్కులు విడుదల చేశారు. రాత్రి 8 గంటలకు మరింత పెరిగి 26,606 క్యూసెక్కులు రాగా, 19 గేట్లను ఎత్తారు. సముద్రంలోకి 14,250 క్యూసెక్కులు, కాల్వలకు 7,912 క్యూసెక్కులు విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తోంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ.. బ్యారేజీ వద్ద 12 అడుగుల మట్టాన్ని ఉంచి, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని