‘ఉమాపై తప్పుడు కేసు దారుణం’
eenadu telugu news
Published : 31/07/2021 06:01 IST

‘ఉమాపై తప్పుడు కేసు దారుణం’

ఉమామహేశ్వరరావు సతీమణి అనుపమను పరామర్శిస్తున్న శ్వేత, అనూరాధ తదితరులు

గొల్లపూడి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. దేవినేని ఉమాను అరెస్టు చేసి జైలుకు పంపిన నేపథ్యంలో ఆయన సతీమణి అనుపమను గొల్లపూడిలోని నివాసంలో పలువురు తెదేపా నాయకులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని, ప్రశ్నించిన వారిని బెదిరించడం, తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ న్యాయస్థానాల్లో తప్పక న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అవినీతిని ఉమామహేశ్వరరావు రెండేళ్లుగా ప్రశ్నిస్తున్నారని, దీనిని భరించలేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఉమామహేశ్వరరావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్పొరేటర్‌ కేశినేని శ్వేత మాట్లాడుతూ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. మాజీ శాసనసభ్యుడు శ్రీరాం తాతయ్య, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, గన్నవరం నియోజకవర్గం బాధ్యులు బచ్చుల అర్జునుడు, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని