భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ జట్టు మసాజర్‌కు అభినందన
eenadu telugu news
Published : 31/07/2021 06:01 IST

భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ జట్టు మసాజర్‌కు అభినందన

కోటేశ్వరరావును అభినందిస్తున్న సీనియర్‌ డీసీఎం విజయసారథిరెడ్డి, డీసీఎం రాజేంద్రప్రసాద్‌

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన మీరాబాయి ఛానుకి మసాజర్‌గా వ్యవహరించిన రైల్వే రిజర్వేషన్‌ సూపర్‌వైజర్‌ కందుకూరి వీర కోటేశ్వరరావును శుక్రవారం సీనియర్‌ డీసీఎం విజయసారథిఫరెడ్డి, డీసీఎం రాజేంద్రప్రసాద్‌ అభినందించారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడానికి కృషి చేసి భారత రైల్వే ప్రతిష్ఠను మరింత పెంచారని ప్రశంసించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని