జిల్లాలో 243 ప్రాథమిక పాఠశాలల విలీనం
eenadu telugu news
Published : 31/07/2021 06:24 IST

జిల్లాలో 243 ప్రాథమిక పాఠశాలల విలీనం

మాట్లాడుతున్న డీఈవో గంగాభవాని

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ఆగస్టులో పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు నూతన విద్యావిధానానికి అనుగుణంగా నిర్దేశించిన ప్రాథమిక తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవాని ఆదేశించారు. శుక్రవారం పాతబస్టాండ్‌ పరీక్ష భవన్‌ హాల్‌లో తెనాలి, బాపట్ల డివిజన్ల విద్యా శాఖాధికారులు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ జిల్లాలోని 243 ప్రాథమిక పాఠశాలలను(3, 4, 5 తరగతులు) దగ్గరలోని 202 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నట్లు, 1, 2 తరగతులు అదే పాఠశాలల్లోనే కొనసాగుతాయని తెలిపారు. దీనికి సంబంధించిన మ్యాపింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. ఎక్కడైనా ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల సమస్యలు ఉంటే ఆవిద్యార్థులను పాత ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగిస్తూ హైస్కూల్స్‌ నుంచి ఉపాధ్యాయులు అక్కడికి వెళ్లి పాఠాలు బోధించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపవిద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని