Chandra babu: దాడి చేసి రివర్స్‌ కేసులు పెడతారా?
eenadu telugu news
Updated : 31/07/2021 13:15 IST

Chandra babu: దాడి చేసి రివర్స్‌ కేసులు పెడతారా?

అక్రమ మైనింగ్‌ జరగకపోతే ఎందుకు అడ్డుకున్నారు?

విజయవాడ : దేవినేని ఉమపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైకాపా నాయకులే దాడి చేసి రివర్స్‌ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. విజయవాడలోని గొల్లపూడిలో దేవినేని కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘జరిగిన ఘటన మొత్తాన్ని ప్రజలంతా గమనించారు. ఎస్సీలపై దాడి చేసినట్లు దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కొట్టేస్తున్నారు. అక్రమ మైనింగ్‌ జరుగుతోందని చెప్పినా పట్టించుకోలేదు. దేవినేని ఉమపై కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య. దాడి చేసి రివర్స్‌ కేసు పెట్టడం నీచమైన పని. డీజీపీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై ఉమ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోనందుకే పరిశీలనకు వెళ్లారు. పోలీసులు ఇంత నీచంగా ఎప్పుడూ పనిచేయలేదు. అక్రమ మైనింగ్‌ జరగకపోతే నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారు? పోలీసులు దారి మళ్లించి దాడి జరిగే ప్రాంతం వైపు ఉమను వెళ్లేలా చేశారు. ఈ దాడులకు తెదేపా భయపడదు. తెదేపాతో పెట్టుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారు’ అని చంద్రబాబు అన్నారు.

అక్రమ మైనింగ్‌పై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. సీనియర్‌ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కొండపల్లి అటవీప్రాంతంలో ఇటీవల దేవినేని ఉమ క్షేత్రస్థాయి పరిశీలన చేసిన విషయం తెలిసిందే. పర్యటన అనంతర ఘర్షణల్లో ఉమపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని