అత్యాధునిక చికిత్స
eenadu telugu news
Published : 01/08/2021 02:43 IST

అత్యాధునిక చికిత్స

వివరాలు వెల్లడిస్తున్న నారాయణరెడ్డి తదితరులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: దగ్గినప్పుడు రక్తం పుడుతున్న ఓ రోగికి నూతన చికిత్సా విధానాలతో పూర్తిగా నయం చేయగలిగామని కార్డియాలజిస్ట్‌ నారాయణరెడ్డి తెలిపారు. అరండల్‌పేటలోని శ్రీ ఆసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరుకు చెందిన ఆలి(46)కి 15 ఏళ్ల నుంచి దగ్గినప్పుడు రక్తం పడుతుండేది. ఇటీవలి ఆయన తమ ఆసుపత్రికి వచ్చాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తుల గాలి గదుల చుట్టూ ఉండే సన్నటి రక్తనాళం చిట్లినందున అతను దగ్గినప్పుడు రక్తం పడుతున్న విషయాన్ని గుర్తించాం. ఆగస్టు 29న అతనికి తొడ దగ్గర ఉండే రక్తనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి సన్నటి గొట్టం పంపి చిట్లిన రక్తనాళాన్ని మూసి వేసినట్లు తెలిపారు. సమావేశంలో వైద్యులు కందుల కల్యాణ చక్రవర్తి, సుప్రజ, యార్లగడ్డ రవితేజ, అమరేంద్ర పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని