వైకాపా ప్రభుత్వంలో కాపులకు సముచిత స్థానం
eenadu telugu news
Published : 01/08/2021 02:43 IST

వైకాపా ప్రభుత్వంలో కాపులకు సముచిత స్థానం

మంత్రి పేర్ని నాని


అడపా శేషగిరిరావుతో ప్రమాణం చేయిస్తున్న మంత్రి పేర్ని నాని. చిత్రంలో మంత్రులు
ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి, కన్నబాబు తదితరులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని కాపులకు వైకాపా ప్రభుత్వంలో సముచిత స్థానం లభించిందని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులైన అడపా శేషగిరిరావుతో మంత్రి పేర్ని శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పేదవర్గాలకు అండగా నిలచిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వంటి నాయకులను ఒక కులానికి పరిమితం చేయడం ఎంత తప్పో వంగవీటి రంగాను కులనాయకుడిగా ముద్రవేయకూడదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైకాపా ప్రభుత్వం విద్యకు ప్రాధన్యం ఇస్తోందన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయడంతోపాటు విద్య, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగా పరిగణించాయన్నారు. కాపులు ఆర్థికంగా, సామాజిక, విద్యాపరంగా బలోపేతం చేసేందుకు కాపు కార్పొరేషను కృషి చేయాలని సూచించారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషగిరిరావు మాట్లాడుతూ.. తనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్‌, విజయవాడ, గుంటూరు నగర మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, మనోహర్‌ నాయుడు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని