కొవిడ్‌ మూడో దశ వ్యాప్తిపై అప్రమత్తత అవసరం
eenadu telugu news
Published : 01/08/2021 02:43 IST

కొవిడ్‌ మూడో దశ వ్యాప్తిపై అప్రమత్తత అవసరం

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కొవిడ్‌ మూడో దశను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కరోనా నియంత్రణపై శనివారం నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రంలో రోజుకు 20 వేల కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు వేల కేసులు రోజూ నమోదవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో చేపట్టిన ఫీవర్‌ సర్వేలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌ నివాస్‌ చేస్తున్న కృషిని అభినందించారు. కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ.. కరోనా నిర్ధారణ పరీక్షలు నగరంలో అయిదు వందల నుంచి 2 వేలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు వేల నుంచి తొమ్మిది వేలకు పెంచాలన్నారు. మున్సిపల్‌ కార్పొరేషను పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో 4,800 పడకలు ఉన్నాయని అదనంగా మరో 1700 పడకలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ శివశంకర్‌, సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, డీఎంఅండ్‌హెచ్‌వో సుహాసిని, వీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ శారద, సీఎంవోహెచ్‌ గీతాబాయ్‌, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, సీపీ బత్తిన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని