ఏ కష్టమొచ్చిందో.. ఏమో..
eenadu telugu news
Updated : 01/08/2021 02:43 IST

ఏ కష్టమొచ్చిందో.. ఏమో..

వివాహిత బలవన్మరణం


మృతురాలు శిరీష

అంగర, న్యూస్‌టుడే: ఏం జరిగిందో.. ఏ కష్టమొచ్చిందో.. ఆ ఇంటి ఇల్లాలు అర్ధాంతరంగా తనువు చాలించింది. పొత్తిళ్లలో పాలు తాగే ఆరునెలల శిశువుతో పాటు, మూడేళ్ల చిన్నారిని.. తల్లి లేని అనాథల్ని చేసి అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఇంట్లో సీలింగ్‌ ప్యానుకు ఉరేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన కపిలేశ్వరపురం మండలం అంగరలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన గోరంట్ల సుబ్బారావు మండలంలోని మాచరలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అంగరలోని ఒక అద్దె ఇంట్లో భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం సుబ్బారావు భార్య శిరీష (22) వేరే గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే సుబ్బారావు కపిలేశ్వరపురం సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, మండపేట గ్రామీణ సీఐ శివగణేష్‌ మృతదేహాన్ని పరిశీలించి, ఆమె భర్తను విచారించారు. వీఆర్వో డీవీ రాఘవులు ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిరీష కుమార్తె గుంటూరులోని బంధువుల ఇంట్లో ఉంటుంది. సుబ్బారావు, శిరీష దంపతులు అనోన్యంగా ఉంటారని స్థానికులు అంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని