ఈవీఎం, వీవీప్యాట్స్‌కు భద్రత కల్పించండి : కలెక్టర్‌
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

ఈవీఎం, వీవీప్యాట్స్‌కు భద్రత కల్పించండి : కలెక్టర్‌

స్టాకు రిజిస్టరు పరిశీలిస్తున్న కలెక్టరు వివేక్‌ యాదవ్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో ఈవీఎంలు, వీవీప్యాట్స్‌కు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరు వివేక్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం గుంటూరులోని ఆర్డీవో కార్యాలయం, ఫిరంగిపురం మండలం రేపూడి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో భద్రపరచిన ఈవీఎం, వీవీపాట్లను కలెక్టరు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే ప్రత్యేక ఉప కలెక్టరు, నోడల్‌ అధికారి శైలజ, డీఆర్‌వో కొండయ్య, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని