అర్హులకు సకాలంలో రుణాలివ్వాలి
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

అర్హులకు సకాలంలో రుణాలివ్వాలి

మాట్లాడుతున్న జేసీ దినేష్‌కుమార్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో అర్హులైన రైతులు, కౌలు రైతులకు పంట రుణాలను సకాలంలో విడుదల చేయాలని సంయుక్త కలెక్టరు దినేష్‌కుమార్‌ అన్నారు. శనివారం గుంటూరు నగరం జీటీ రోడ్డులోని యూనియన్‌ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో బ్యాంకర్ల సమన్వయకర్తల సమావేశం ఎల్‌డీఎం ఈదర రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు భాగస్వామ్య రుణాలు మంజూరు చేయాలన్నారు. బ్యాంకర్లు, ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఓసారి సమావేశం నిర్వహించాలని సూచించారు. యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం రవికుమార్‌, నాబార్డు ఏజీఎం కార్తీక్‌, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్‌, ఉద్యానశాఖ ఉపసంచాలకులు సుజాత, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని