బాలిక ప్రాణం తీసిన చరవాణి వివాదం
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

బాలిక ప్రాణం తీసిన చరవాణి వివాదం

భవానీపురం, న్యూస్‌టుడే: చరవాణి విషయంలో అక్కా తమ్ముడి మధ్య తలెత్తిన వివాదం అక్క మరణానికి దారితీసింది. విజయవాడలోని భవానీపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక పాఠశాలలో ఓ బాలిక(16) తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి మార్బుల్‌ దుకాణంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. వీరు ఉపాధి నిమిత్తం ఖమ్మం జిల్లా ఎర్రబాలెం నుంచి భవానీపురం వచ్చి నివాసముంటున్నారు. బాలిక సోదరుడు ఆరో తరగతి చదువుతున్నాడు. వీరికి ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండటంతో ఇద్దరూ ఒకే చరవాణిలో పాఠాలు వింటున్నారు. జులై 28వ తేదీ రాత్రి చరవాణి విషయంలో వారిద్దరూ గొడవపడుతుండగా.. బాలికను తల్లి మందలించారు. మనస్తాపం చెందిన బాలిక అదేరోజు అర్ధరాత్రి పురుగు మందు తాగింది. 29వ తేదీ ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులకు తాను గడ్డిమందు తాగానని, కాళ్లు, చేతులు లాగుతున్నాయని చెప్పింది. వెంటనే గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ జులై 30వ తేదీ రాత్రి మృతిచెందింది. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఏఎస్‌ఐ యు.వెంకటేశ్వరరావు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని