4.05 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

4.05 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు

సబ్‌కలెక్టరేట్‌ : జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 34,675 మంది రైతుల నుంచి రూ.708.39 కోట్ల విలువైన 4,05,468 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు జేసీ కె.మాధవీలత తెలిపారు. ఇప్పటి వరకు రైతులకు రూ.704.01 కోట్లు చెల్లించగా, మరో రూ.4.38 కోట్ల చెల్లింపులకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు వివరించారు. నగరంలోని తమ విడిది కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కార విషయమై శనివారం ఆమె ‘డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌’ కార్యక్రమం నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని