పెళ్లి సంబంధాలు చెడకొడుతున్న యువకుడిపై కేసు
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

పెళ్లి సంబంధాలు చెడకొడుతున్న యువకుడిపై కేసు

పెనమలూరు, న్యూస్‌టుడే: వైద్యురాలి పెళ్లి సంబంధాలు చెడకొడుతున్న యువకుడిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పటమటకు చెందిన ఓ వైద్యురాలికి, కానూరుకు చెందిన కోయ సంపత్‌ అనే యువకుడికి కొంతకాలంగా పరిచయం ఉంది. ఇటీవల ఈమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. సంపత్‌ తప్పుడు సమాచారాలు, మెసేజ్‌లు మగ పెళ్లి వారికి పంపుతూ సంబంధాలు చెడగొడుతున్నాడు. దీనిపై ఈమె ప్రశ్నించగా బెదిరింపులకు దిగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు శనివారం సంపత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని