కొండపల్లి అడవుల్లో హెచ్చరిక బోర్డులు
eenadu telugu news
Published : 02/08/2021 02:49 IST

కొండపల్లి అడవుల్లో హెచ్చరిక బోర్డులు

కొండపల్లి, న్యూస్‌టుడే: కొండపల్లి అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకూడదంటూ ఆదివారం ఆ ప్రాంతంలో పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కొండపల్లి అడవుల్లో అక్రమ మైనింగ్‌ అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని అతిక్రమించి ఎవరైనా అడవిలో మైనింగ్‌ జరిగిన ప్రాంతాన్ని చేరుకొంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని